ap7am logo

నేటి వార్తలు... టూకీగా

Sat, Feb 23, 2013
తమన్నా
తమన్నా
*  కాల్ షీట్ల సర్దుబాటు విషయంలో వున్న
ఇబ్బందులు తనకు బాగా తెలుసని అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. "ఒకేసారి
నాలుగైదు సినిమాలకు సంతకాలు చేయడం పెద్ద గొప్పేమీ కాదు. అయితే, వాటికి
సవ్యంగా డేట్లు కేటాయించడమే పెద్ద పని. అందుకే నేనలాంటి పనులు చేయడం లేదు.
మెల్లిగానే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళుతున్నాను" అంటూ చెబుతోంది తమ్మూ.
*
 నయనతార కథానాయికగా శేఖర్ కమ్ముల రూపొందించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు
వేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన స్క్రిప్టు పనిని యండమూరి
వీరేంద్రనాథ్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ నుంచి దీని షూటింగు మొదలవుతుంది.
*
 చిన్న చిన్న రౌడీ పాత్రలు పోషిస్తూ పెద్ద పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు
కొంగర జగ్గారావు నిన్న హైదరాబాదులో మరణించారు. 88 సంవత్సరాల వయసున్న
జగ్గారావు బాపు దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమా ద్వారా నటుడిగా రంగ
ప్రవేశం చేశారు. ఎన్టీ రామారావుకి అనుచరుడిగా పేరున్న జగ్గారావు సుమారు 500
సినిమాలలో నటించారు.
*  ప్రవాసాంధ్ర అభిమానులను కలవడానికి హీరో ప్రభాస్
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ చేరుకున్నారు. లాస్ ఏంజిల్స్, బే ఏరియాలోని
ధియేటర్లను ఈ రెండు రోజులూ సందర్శించి, అభిమానులతో 'మిర్చి' చిత్రాన్ని
ప్రభాస్ చూస్తారు.                   
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Related News
Movie News (Latest)