ap7am logo

పితృ తిథిన దైవపూజ?

Sat, Aug 31, 2013, 12:57 PM
Related Image పితృతిథి రోజున పితృదేవతలను ఆహ్వానించి మడికట్టుకుని వారికి ఇష్టమైన వంటకాలను సిద్ధం చేయడం, పితృదేవతలను పూజించి బ్రాహ్మణులకు భోజనాలు ఏర్పాటు చేయడం అనాదిగా ఆచారంగా వస్తోంది. ఈ విధంగా చేయడం వలన పితృ దేవతలు సంతృప్తి చెందుతారని అంతా భావిస్తుంటారు.

అయితే ఇలా పెద్దల తిథులకి సంబంధించిన రోజుల్లో, రోజువారి పూజ చేసుకోవచ్చో లేదో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. పితృ కార్యానికి ముందు దేవుడికి నైవేద్యం పెట్టాలో, ఆ తరువాత సమర్పించాలో అర్థంకాక అయోమయానికి లోనవుతుంటారు. పెద్దల తిథి రోజున నిత్య పూజలు యధావిధిగా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున దైవానికి పాలు - పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. కానీ మహా నైవేద్యాన్ని మాత్రం ... పితృ దేవతలతో పాటే నివేదన చేయాలని శాస్త్రం చెబుతోంది.

పితృకార్యానికి వచ్చిన బ్రాహ్మణులకు వడ్డన జరుగుతోన్న సమయంలోనే, ఆయా పదార్థాలను మరో పళ్లెంలోకి తీసి దైవానికి సమర్పించాలని అంటోంది. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి దోషం కలగదని చెబుతోంది. ముందుగా తల్లిదండ్రులను పూజించాలనీ, ఆ తరువాత దైవాన్ని ఆరాధించాలనే అర్థం ఈ ఆచారంలో దాగివుందనే విషయం మనకి బోధపడుతుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy