ap7am logo

సంకల్ప సిద్ధి హనుమ

Mon, Aug 26, 2013, 06:04 PM
Related Image ఆరోగ్యాన్ని ఇవ్వమనీ ... ఆపదల నుంచి గట్టెక్కించమనే ప్రతిఒక్కరూ ఆ దైవాన్ని కోరుతుంటారు. దైవం వారి మొర ఆలకించి వారి కోరికలను నెరవేర్చినట్టయితే, ఇక వారు ఆ స్వామి పాదాలను విడువరు ... ఆ స్వామి నామాన్ని మరువరు. భక్తులచే అంతటి విశ్వాసాన్ని చూరగొన్న హనుమంతుడి క్షేత్రం మనకి హైదరాబాద్ - మల్కాజ్ గిరిలో దర్శనమిస్తుంది.

భక్తులు అడిగినదే తడవుగా వారికి అవసరమైనవి ప్రసాదించే స్వామిగా ఇక్కడి హనుమంతుడికి పేరుంది. ఈ కారణంగానే ఆయనను అంతా 'సంకల్ప సిద్ధి హనుమ' అని పిలుస్తుంటారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల ఈ హనుమంతుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. పూర్వం ఈ ప్రాంతం అరణ్యంగా ఉన్నప్పటి నుంచి స్వామి ఇక్కడ పూజలు అందుకుంటూ వున్నాడు. గతంలో స్వామి కొలువుదీరిన చిన్నపాటి మందిరం శిధిలావస్థకు చేరుకోగా, ఓ భక్తుడు దాతల సహాయ సహకారాలతో స్వామికి ఆలయాన్ని నిర్మించాడు.

ఈ నేపథ్యంలోనే ఇక్కడి ప్రాంగణంలో శ్రీదేవి - భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం .. విజయ గణపతి ఆలయం .. నవగ్రహ మంటపం కొలువుదీరాయి. వరాలను ప్రసాదించే హనుమంతుడు .. విజయాలను అందించే వినాయకుడు .. వైభవాన్ని ఆవిష్కరించే వేంకటేశ్వరుడు నెలవైనందు వలన ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఈ కారణంగా ఈ క్షేత్రంలో హనుమజ్జయంతి .. ముక్కోటి ఏకాదశి .. వినాయక చవితి వంటి పర్వదినాల్లో విశేష పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ వేడుకలను కనులారా వీక్షించడానికి, మనసారా తరించడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy