ap7am logo

కోరికలను నెరవేర్చు వేంకటేశ్వరుడు

Mon, Jun 17, 2019, 04:55 PM
వేంకటేశ్వరస్వామి ఎక్కడ ఉంటే అక్కడ వైభవం ఉంటుంది .. భక్తుల సందడి ఉంటుంది. అలాంటి స్వామివారు కొలువైన ఆలయాలలో ఒకటి హైదరాబాద్ - వనస్థలిపురంలో కనిపిస్తుంది. ఇక్కడి కమలానగర్లో శ్రీదేవి - భూదేవి సమేతుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తుంది.

విశాలమైన ముఖమంటపంతో కూడిన ఈ ఆలయం అందంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు శ్రీదేవి - భూదేవిలతో కలిసి దర్శనమిస్తుంటాడు. మూలమూర్తులు దివ్యమైన తేజస్సును వెదజల్లుతుంటాయి. శనివారం రోజున స్వామివారి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో నిత్యోత్సవాలు .. వారోత్సవాలు .. పక్షోత్సవాలు .. మాసోత్సవాలు .. అయినోత్సవాలను ఘనంగా జరుపుతారు. స్వామివారి దర్శనం వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయని అంటారు. ధర్మ బద్ధమైన కోరికలు నెరవేరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy