ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తులసి పూజా ఫలితం

Wed, Jan 03, 2018, 05:44 PM
Related Image ఆధ్యాత్మిక చింతన కలిగిన చాలామంది ఇంటి ఆవరణలలో 'తులసి కోట' కనిపిస్తూ ఉంటుంది. తులసి మొక్కలో బ్రహ్మ  విష్ణు మహేశ్వరులు ఉంటారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే సమస్త దేవతలు తులసి కోటలో కొలువై ఉంటారని అంటున్నాయి. సమస్త పుణ్యతీర్థాలు తులసిని ఆశ్రయించి వుంటాయని చెబుతున్నాయి. ప్రతిరోజు తులసి కోట ముందు ఆవు పేడతో అలికి ..ముగ్గులు పెట్టవలసి ఉంటుంది. స్నానం చేసిన తరువాత తులసికి నీళ్లుపోసి .. ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది.

అలాగే సంధ్యా సమయంలోను తులసి కోటలో దీపం పెట్టవలసి ఉంటుంది. తులసి మొక్కకు నమస్కరించి .. స్వామివారి పూజ కోసమే నీ దళాలు కోస్తున్నాను అని అనుమతిని కోరి దళాలు కోయవలసి ఉంటుంది. అలా కోసిన తులసి దళాలతో విష్ణుమూర్తిని ఆరాధించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయనేది ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆది .. మంగళ .. గురు .. శుక్రవారాల్లో తులసిని కోయకూడదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.      
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy