ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భీమశంకరుడు అలా ఆవిర్భవించాడట

Mon, Jan 01, 2018, 06:43 PM
Related Image పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో జ్యోతిర్లింగాలకు ఎంతో విశిష్టత వుంది. ఒక్కో జ్యోతిర్లింగం ఆవిర్భావం వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. అలాంటి జ్యోతిర్లింగాలలో 'శ్రీ భీమశంకరం' ఒకటిగా భక్తులకు దర్శనమిస్తోంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం పూనా సమీపంలో ..  సహ్యాద్రి పర్వతంపై విలసిల్లుతోంది. త్రిపురాసుర సంహారం తరువాత సదాశివుడు ఈ ప్రదేశంలో సేదదీరాడని స్థలపురాణం చెబుతోంది.

అప్పటికే ఎంతో కాలం నుంచి అక్కడ భీమకుడు అనే శివ భక్తుడైన రాజు .. స్వామి గురించి కఠోర తపస్సు చేస్తున్నాడట. ఆ భక్తుడికి ప్రత్యక్ష దర్శనం ఇచ్చిన స్వామి, ఆయన కోరిక మేరకు అక్కడే ఆవిర్భవించాడని అంటారు. భీమకుడు అనే భక్తుడి కోరిక మేరకు శంకరుడు ఇక్కడ  కొలువుదీరిన కారణంగా, ఈ క్షేత్రానికి 'భీమశంకరం' అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఇక్కడ సదా శివుడిని పూజించాడని అంటారు. అలాంటి ఈ జ్యోతిర్లింగ దర్శనం వలన, సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. 
X

Feedback Form

Your IP address: 50.19.34.255