ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పళ్లాలమ్మ తల్లి అలా ఆవిర్భవించిందట!

Sat, Dec 30, 2017, 06:03 PM
Related Image గోదావరి జిల్లాల్లో 'పళ్లాలమ్మ తల్లి' క్షేత్రం గురించి తెలియని వారుండరు. అంతగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. తూర్పుగోదావరి జిల్లా .. కొత్తపేట మండలం 'వానపల్లి'లో ఈ తల్లి కొలువైంది. పూర్వం ఈ ప్రాంతంలో వానరులు తిరుగాడేవారనీ .. అందువల్లనే 'వానరపల్లి'గా పిలవబడేదని చెబుతారు. కాలక్రమంలో ఆ పేరు కాస్త 'వానపల్లి'గా మారిపోయిందని అంటారు.

ఇక సీతారాములు ఈ ప్రాంతానికి వచ్చారనీ .. సీతమ్మ తల్లి వల్లనే 'పళ్లాలమ్మ తల్లి' ఇక్కడ ఆవిర్భవించిందని చెబుతారు. ఈ ప్రదేశానికి వచ్చిన సీతమ్మ తల్లి .. ప్రకృతి మాతను పూజించిందట. ఆ తల్లి సీతమ్మ కోసం పువ్వులతో .. పండ్లతో ప్రత్యక్షమైందట. సీతమ్మ తల్లి ఎదుట ప్రకృతి మాతగా ప్రత్యక్షమై, పువ్వులను - పండ్లను అందించిన అమ్మవారే 'పళ్లాలమ్మ'గా ఇక్కడ ఆవిర్భవించిందని కథనం. ఆనాటి నుంచి అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటూ .. వారి ధర్మ బద్ధమైన కోరికలను నెరవేరుస్తోంది. ఈ ప్రాంతంలోని చాలామంది ఈ అమ్మవారిని తమ ఇష్ట దైవంగా భావించి ఆరాధిస్తూ వుంటారు .. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతుంటారు.       
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy