ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నీలం శంఖం పుష్పాలతో శనిదేవుడికి పూజ

Thu, Dec 07, 2017, 09:11 AM
Related Image శని దేవుడి పేరు వినగానే సహజంగానే చాలామంది భయపడుతూ వుంటారు. ఎందుకంటే ఆయన చూపే ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. జీవితంలో అనేక ఆటంకాలను కలిగిస్తూ .. అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటాడు. ఆరోగ్య పరంగాను .. ఆర్ధిక పరంగాను సమస్యలను సృష్టిస్తూ సతమతం చేస్తుంటాడు. ఒకదాని తరువాత ఒకటిగా కష్టనష్టాలను కలిగిస్తూ .. సమయానికి ఎవరి సహాయమూ అందకుండా చేస్తూ నిరాశా నిస్పృహలను కలిగిస్తూ ఉంటాడు.

అలాంటి శని దేవుడిని శాంతిపచేయడానికి అనేక మార్గాలు సూచించబడ్డాయి. వాటిలో 'నీలం శంఖం' పూలతో ఆ స్వామిని పూజించడం ఒకటి. దేవతలకే కాదు .. గ్రహాలకు కూడా కొన్ని రకాల పూలు ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. దేవతలకి ఇష్టమైన పూలతో పూజించడం వలన వాళ్లు ప్రీతి చెందుతారు. అలాగే శని దేవుడికి ఇష్టమైన 'నీలం శంఖం' పూలతో అనునిత్యం ఆ స్వామిని పూజించాలి. ఈ విధంగా చేయడం వలన ఆయన శాంతిస్తాడు .. ఆయన అనుగ్రహం కారణంగా శని దోష ప్రభావం తగ్గుముఖం పడుతుంది.        
X

Feedback Form

Your IP address: