ap7am logo

రాహు కేతువులు ఇలా కూడా శాంతిస్తారు

Fri, Dec 01, 2017, 09:05 AM
Related Image రాహువు .. కేతువులను ఛాయా గ్రహాలంటారు. ఈ రెండు గ్రహాల అనుగ్రహం లేకపోవడం వలన అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో రకాల సమస్యలు సతమతం చేస్తుంటాయి. మానసికపరమైన .. శారీరకపరమైన కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. నిరాశ నిస్పృహలను కలిగిస్తూ కుంగదీస్తూ ఉంటాయి. అందువలన రాహు కేతువులను శాంతిప జేయడానికి ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నిస్తుంటారు.

రాహు కేతువులను శాంతిపజేయడానికి అనేక మార్గాలు చెప్పబడ్డాయి. వాటిలో 'దుర్గాదేవి' ఆరాధన ఒకటి. 'ఛాయా రూపేణ' అంటూ దుర్గాదేవిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. అందువలన దుర్గాదేవిని పూజించడం వలన రాహు కేతువులు శాంతిస్తారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దుఃఖాన్ని .. దారిద్ర్యాన్ని .. దుర్గతులను దుర్గాదేవి నివారిస్తుంది. దుష్ట శక్తుల నుంచి .. దుష్ట ప్రయోగాల నుంచి కాపాడుతుంది. అలాంటి దుర్గాదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన, రాహు కేతువులు శాంతించి అనుగ్రహిస్తారు. ఫలితంగా రాహు కేతువుల వలన కలిగే బాధల నుంచి విముక్తి కలుగుతుంది. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy