ap7am logo

శని దేవుడు ఇలా కూడా శాంతిస్తాడు

Wed, Nov 29, 2017, 09:02 AM
Related Image జీవితం ఆనందంగా .. సంతోషంగా సాగిపోవాలని అంతా అనుకుంటారు. అయితే శని దోష ప్రభావం వలన జీవితం అతలాకుతలం కావడం జరుగుతూ ఉంటుంది. శని దోష ప్రభావం వలన ఆర్థికపరమైన .. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అవమానాలు ఎదురవుతుంటాయి .. కార్యహాని జరుగుతూ ఉంటుంది. అందువలన శనిదోష నివారణకు ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నిస్తుంటారు.

శని దేవుడిని శాంతిపజేయడానికి అనేక మార్గాలు చెప్పబడ్డాయి. ప్రతి శనివారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి .. సూర్యాస్తమయం తరువాత హనుమంతుడిని పూజిస్తూ ఉండాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి .. ఎర్రని పూలతో స్వామిని అర్చించాలి. అంతేకాదు .. ప్రతి శనివారం రోజున కోతులకు అరటిపండ్లు .. బెల్లం కలిపిన శనగలను ఆహారంగా అందించాలి. అలాగే శనగలను చేపలకు ఆహారంగా వేయాలి. నల్లకుక్కకు .. నల్ల ఆవుకు తీపి రొట్టెలను ఆహారంగా అందించాలి. ఈ విధంగా చేయడం వలన శనిదేవుడు శాంతిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శనిదేవుడు అనుగ్రహించడం వలన .. దోష ప్రభావం తగ్గుతూ వెళుతుంది. దాంతో ఆందోళనలు .. అవాంతరాలు తొలగిపోయి, శుభాలు జరగడం మొదలవుతుంది.         
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy