ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నరసింహస్వామి నామ స్మరణ ఫలితం!

Sat, Sep 09, 2017, 05:57 PM
Related Image లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు .. నరసింహస్వామిగా అవతరించాడు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికీ .. భక్తుడికి తనపై గల నమ్మకాన్ని నిలపడానికి ఆయన నరసింహస్వామిగా వచ్చాడు. అలా వచ్చిన నరసింహస్వామి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. ఆ ప్రదేశాలన్నీ మహా శక్తివంతమైన .. మహిమాన్వితమైన క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి.

 నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన సమస్త పాపాలు నశించి .. పుణ్యఫలాలు లభిస్తాయి. ఇక ఆయా క్షేత్రాలు దర్శించలేనివాళ్లు అనునిత్యం ఆయన నామ స్మరణ చేయడం వలన కూడా విశేషమైన ఫలితాలు వుంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నరసింహస్వామి నామాన్ని స్మరిస్తూ ఉండటం వలన, భయాలు .. బాధలు తొలగిపోతాయి. దుష్ట శక్తుల వలన పీడించబడుతున్నవారు .. వాటి బారి నుంచి విముక్తిని పొందుతారు. తలపెట్టిన కార్యాలకు అడ్డంకులు తొలగిపోయి .. విజయాలు సొంతమవుతాయి. ఆపదలు .. అనారోగ్యాలు దూరమై ఆయురారోగ్యాలు చేకూరతాయి.   
X

Feedback Form

Your IP address: 67.225.212.107