ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎక్కడ ప్రశాంతత ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది

Fri, Aug 04, 2017, 05:18 PM
Related Image కొంతమంది ఇళ్లల్లోకి అడుగు పెట్టగానే అబ్బా .. ఎంత ప్రశాంతంగా వుంది అనిపిస్తుంది. వాళ్లు తమ ఇల్లును సర్దుకున్న తీరు .. పూజా మందిరాన్ని అలకరించుకున్న విధానం చూస్తే ఎంత పవిత్రంగా వుంది అనిపిస్తుంది. కుటుంబ సభ్యులంతా శాంతంతో వున్నప్పుడే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. శాంతం అనేది మనిషిలో తేజస్సును .. పెద్దరికాన్ని తెచ్చిపెడుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు శాంతంగా వున్నవారు మాత్రమే తీసుకోగలుగుతారు. శాంతంగా వున్నవారికి ఆత్మీయులు ఎక్కువగా వుంటారు.

 ఇక కోపంగా వున్నవారికి అంతా దూరంగా ఉండటానికే ఇష్టపడతారు. కోపంగా ఉండేవారి ఇంట కీచులాటలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి చోటున ఎక్కువ సేపు ఉండటానికి ఎవరూ ఆసక్తి చూపరు. సిరిసంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి కూడా అంతే. ఎవరి ఇల్లయితే ప్రశాంత నిలయంగా అనిపిస్తుందో .. పవిత్రంగా కనిపిస్తుందో అక్కడ ఉండటానికే అమ్మవారు ఇష్టపడుతుంది. తనకి ప్రీతికరమైన మార్గంలో నడిచేవారి పట్లనే తన కరుణా కటాక్ష వీక్షణాలను ఉంచుతుంది.
X

Feedback Form

Your IP address: 67.225.212.107