ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందుకే దేవుని కడప అంటారు

Mon, Jul 31, 2017, 06:27 PM
Related Image కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ వైభవం ఉంటుంది. ఆ స్వామి కొలువైన క్షేత్రాలు అనునిత్యం భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. అలా ఆ స్వామి కొలువుదీరిన అతి ప్రాచీనమైన క్షేత్రాల్లో 'దేవుని కడప' ఒకటి. వేంకటేశ్వరస్వామి కోరిక మేరకి ఆ స్వామి మూర్తిని కృపాచార్యుల వారు ఇక్కడ ప్రతిష్ఠించారట. స్వామివారు అమ్మవారి సమేతంగా అనుగ్రహిస్తూ లక్ష్మీ వేంకటేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

 శ్రీకృష్ణదేవరాయల వారు ఈ స్వామివారిని అనేక మార్లు దర్శించుకుని, ఎన్నో కానుకలు భక్తితో సమర్పించుకున్నట్టుగా ఇక్కడ ఆధారాలు వున్నాయి. పూర్వం ఇక్కడి లక్ష్మీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తరువాతనే , తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వెళ్లేవారట. అలా ఈ క్షేత్రం తిరుమలకి తొలి గడపగా ఉండేదట. అందువల్లనే ఈ ఊరుకు 'దేవుని గడప' అనే పేరు వచ్చిందట. అదే కాలక్రమంలో 'కడప' గా మారిందని స్థలపురాణం చెబుతోంది.   
X

Feedback Form

Your IP address: 67.225.212.107