ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆపదలను తొలగించే ఆదిదేవుడు

Tue, Jul 25, 2017, 06:54 PM
Related Image పరమశివుడు .. భక్తులు కొలిచినంతనే కరిగిపోతాడు .. పిలిచినంతనే పరిగెత్తుకు వస్తాడు. అంకిత భావంతో అర్చిస్తే చాలు ఆ స్వామి ఆనందంతో పొంగిపోతాడు .. సంతోషంతో వరాలను ప్రసాదిస్తాడు. అలా ఆ దేవదేవుడు కొలువైన ఆలయాలలో 'కీతవారి గూడెం' ఒకటి. ఇది సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పరిథిలో దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన ఆపదలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆపదలో పడినవాళ్లు ఆ స్వామిని మనసులో తలచుకున్నంతనే బయటపడతారని చెప్పుకుంటూ వుంటారు.

 ఆలయ ప్రాంగణంలో ఒక వైపున శివుడు .. మరో వైపున హనుమంతుడు రూపం కలిగిన ఒకే విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఇక ఈ ఆలయం పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి దీక్షా కాలంలో ఈ ఆలయం మరింత సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు ఆలయాలు కూడా ప్రశాంతతకు .. పవిత్రతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. భక్తుల అంకితభావానికి అద్దం పడుతుంటాయి. రహదారి పక్కనే ఉండటం వలన అటుగా వెళ్లే వాళ్లు .. వచ్చే వాళ్లు పెద్దసంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ వుంటారు.           
X

Feedback Form

Your IP address: