ap7am logo

లక్ష్మీదేవికి ప్రీతిని కలిగించేది అదే!

Thu, Jul 06, 2017, 01:56 PM
Related Image ప్రతి ఒక్కరూ కూడా తమ ఇల్లు సిరిసంపదలతో తులతూగాలని కోరుకుంటారు. సంపద వలన అన్ని అవసరాలు తీరకపోయినా, చాలా సమస్యలను తరిమేసే శక్తి దానికి వుంది. అందువల్లనే ధనం విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్త వహిస్తుంటారు. అయితే ధనమనేది కొంతమంది దగ్గర నిలకడగా ఉంటే .. మరికొంతమంది దగ్గరికి అది ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ ఉంటుంది. ఈ కారణంగానే లక్ష్మీదేవి చంచలమైనదని చెప్పుకుంటూ వుంటారు.

 కానీ నిజానికి అమ్మవారికి నచ్చిన చోట ఎంత కాలమైనా ఉంటుంది. ఆమెకి అక్కడి వాతావరణం నచ్చకపోతేనే వెళ్లిపోతుందట. ఎవరైతే వినయంతో ధర్మబద్ధులై తమ జీవితాన్ని కొనసాగిస్తూ వుంటారో, అలాంటివారి ఇంట లక్ష్మీదేవి ఉంటుందని చెబుతారు. లక్ష్మీదేవి రాకతో ఎవరైతే అహంభావంతో వ్యవహరిస్తారో అలాంటివారిని వదిలిపెట్టి వెళ్లిపోవడానికి ఆమె ఎంతమాత్రం ఆలోచించదని అంటారు. అందువలన లక్ష్మీదేవి ప్రీతిని కోరుకునేవారు ధర్మ బద్ధులై పవిత్రమైన జీవితాన్ని గడపవలసి ఉంటుంది.     
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy