ap7am logo

సూర్యారాధన ఫలితం

Sat, Jun 03, 2017, 09:19 AM
Related Image సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఆరాధించడమనేది వేదం కాలం నుంచీ వుంది. అవతారమూర్తులు .. ఇంద్రాది దేవతలు .. మహర్షులు .. సూర్యభగవానుడిని ఆరాధించిన వారే. సూర్యోదయంతోనే సమస్త జీవులలో చైతన్యం మొదలవుతుంది. ఆ జీవరాశికి అవసరమైన ఆహారాన్ని ప్రకృతి ద్వారా సూర్యుడే అందజేస్తూ ఉంటాడు. అందువల్లనే సమస్త జీవుల జీవనానికి ఆధారభూతుడు సూర్యుడని చెబుతుంటారు.

 సూర్య కిరణాల వలన అనేక రకాల రోగకారక క్రిములు నశిస్తాయి. అందువలన అనారోగ్యం బారిన పడకుండా ఉండటం జరుగుతుంది. ఈ కారణంగానే తమ నివాస ద్వారం తూర్పు ముఖంగా ఉండేలా చూసుకుంటూ వుంటారు.  సూర్య నమస్కారం వలన శారీరక పరమైన ఆరోగ్యం కలుగుతుంది. అలాంటి సూర్యభగవానుడి పూజకి, జాజి .. తామర .. పొగడ .. పున్నాగ .. మోదుగ .. గన్నేరు .. సంపెంగ .. గులాబి .. మందారాలు శ్రేష్టమైనవిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.  సూర్య నమస్కారాల వలన .. ఆయన పూజలో ఈ పూలను ఉపయోగించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని స్పష్టం చేస్తున్నాయి.       
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy