పెరుగుతోన్న వీరభద్రుడు
Tue, Jan 03, 2017, 09:43 AM

వందల సంవత్సరాల చరిత్ర వున్న ఈ క్షేత్రంలో స్వామి ప్రత్యక్షంగా వున్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామి వారి మూర్తి పెరుగుతూ ఉండటమే అందుకు నిదర్శనమని చెబుతుంటారు. ప్రతిష్ఠ నాటికి .. ఇప్పటికీ స్వామి మూర్తి పెరుగుతుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు వున్నాయి. అందువలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ స్వామిని ఆరాధించడం వలన ఆపదలు .. అనారోగ్యాలు దూరమవుతాయనీ, మనసులోని కోరికలు నెరవేరతాయని భక్తులు భావిస్తుంటారు.