ap7am logo

అమ్మా అంటే చాలు అనుగ్రహిస్తుంది

Thu, Oct 20, 2016, 09:01 AM
Related Image శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక నామాలతో పిలవబడుతోంది .. అనేక రూపాలలో కొలవబడుతోంది. ఆయా ప్రాంతాలలో అమ్మవారు ముత్యాలమ్మగా .. పోలేరమ్మగా .. మైసమ్మగా .. నూకాలమ్మగా పూజలు అందుకుంటూ ఉంటుంది. అలా తూర్పుగోదావరి జిల్లా 'పెద్దాపురం'లో అమ్మవారు 'మరిడమ్మ'గా భక్తులను అనుగ్రహిస్తూ వస్తోంది.

చాలాకాలం క్రితం అమ్మవారు ఒక భక్తుడికి కలలో కనిపించి, తాను ఫలానా ప్రదేశంలో కొలువై వున్నట్టుగా చెప్పిందట. తనకి నిత్యపూజలు నిర్వహించమనీ .. ప్రతియేటా జాతర జరిపించమని ఆదేశించిందట. అప్పటి నుంచి అలాగే జరుగుతూ వస్తోంది. జాతరకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. మనసులోని కోరికలను అమ్మవారికి చెప్పుకునేవాళ్లు కొందరైతే .. కోరికలు నెరవేరి మొక్కుబడులు చెల్లించుకునేవాళ్లు మరికొందరు. వివిధ రకాల వ్యాధుల నుంచి .. బాధల నుంచి అమ్మవారు తమని కాపాడుతూ ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు భావిస్తుంటారు. పంటలు బాగా పండేలా చేసి .. తమకి సుఖశాంతులను ప్రసాదించేది ఆ తల్లేనని అంతా విశ్వసిస్తుంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy