ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదే స్వామి వారి మహాత్మ్యం

Wed, Sep 21, 2016, 09:24 AM
Related Image లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో నల్గొండ జిల్లాలోని 'పాలెం' ఒకటిగా కనిపిస్తుంది. నకిరేకల్ సమీపంలో ఈ ప్రాచీన క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది. చాలా ప్రదేశాలలో భగవంతుడి ప్రతిమలు భక్తుల ద్వారా వెలుగు చూశాయి. తాను ఫలానా చోటున వున్నానని కలలో స్వామివారు కనిపించి భక్తులకి చెప్పడం వలన, ఆ ప్రతిమలు వెలుగులోకి వచ్చి పూజాభిషేకాలు అందుకుంటున్నాయి.

అలాగే ఇక్కడి స్వామి వారు కూడా వెలుగు చూశాడు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత వుంది. స్వప్నంలో ఓ భక్తుడికి స్వామివారు కనిపించి, తన జాడను తెలియజేశాడు. కానీ మరునాడు ఆ భక్తుడు ఎంత వెతికినా ఆ జాడ తెలియడం లేదు. అప్పుడు ఒక సాధువు వచ్చి, ఫలానా చోట వెతకమని చెప్పి అదృశ్యమయ్యాడట. అలా భగవంతుడే మారు రూపంలో వచ్చి తన జాడను తెలియజేశాడని అంటారు. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడని విశ్వసిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 67.225.212.107