వేంకటేశ్వరుడి మహిమ
Mon, Jul 18, 2016, 09:21 AM

వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. రెడ్డి దొరల కాలంలో స్వామి ఈ గ్రామానికి వచ్చినట్టుగా చెబుతారు. రెడ్డి దొరలు మరొక గ్రామంలో స్వామివారిని ప్రతిష్ఠించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకోసం మూల విరాట్టు ప్రతిమను తయారు చేయించిన ప్రదేశం నుంచి ఆ గ్రామానికి 'లేదాళ్ల' గ్రామం మీదుగా ఎడ్ల బండిపై తరలిస్తున్నారు.
'లేదాళ్ల' గ్రామం మధ్యలోకి రాగానే అడుగు ముందుకు వేయకుండా ఎడ్లు మొరాయించాయట. ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో, ఆ ప్రదేశంలోనే తనని ప్రతిష్ఠించమని స్వామి అలా సంకేతమిచ్చాడని రెడ్డి దొరలు భావించారు. ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించి, స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారి తేజోమయమైన దివ్యమంగళ రూపాన్ని చూసి తీరవలసిందే.