ap7am logo

ఆపదలను తొలగించే అయ్యప్పస్వామి

Wed, Jun 29, 2016, 09:20 AM
Related Image అయ్యప్పస్వామి చూపిన మహిమలు అన్నీ ఇన్నీ కావు. అందువలన ఆ స్వామి దీక్ష తీసుకునేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీక్ష తీసుకునే భక్తులు ఆ స్వామికి అనునిత్యం పూజాభిషేకాలు జరుపుకోవడానికి గాను, తమ గ్రామాల్లోనే ఆయన ఆలయాలను నిర్మించుకుంటున్నారు. అలా భక్తుల సంకల్ప బలంతో నిర్మితమైన ఆలయాలలో ఒకటి 'కీతవారిగూడెం'లో కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం పరిథిలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తుంది. ఆలయాన్ని తీర్చిదిద్దిన తీరు మనసును దోచేస్తుంది. సాధారణమైన రోజుల్లో రద్దీ తక్కువగానే వున్నా, దీక్షా కాలంలో భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.

ప్రధానమైన రహదారికి దగ్గరలో ఉండటం వలన, ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకుని వెళుతుంటారు. ఆపదలను గట్టెక్కించే స్వామిగా అయ్యప్పస్వామిని గురించి భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక్కడికి సమీపంలో 'రామలింగేశ్వరస్వామి' ఆలయం అలరారుతోంది. ఈ ఆలయం కూడా భారీ నిర్మాణంతో .. భక్తులను ఆకట్టుకుంటూ ఉంటుంది. రామలింగేశ్వరస్వామి దర్శనమే పాపాలను హరించివేస్తుందని అంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy