అదే పాండురంగడి మహిమ!
Mon, May 30, 2016, 12:49 PM

సాధారణంగా ఎక్కడైనా స్వామి వారు వెలసిన తరువాత ఆలయం నిర్మించడం జరుగుతూ వుంటుంది. కానీ చిలకపూడి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు ఒక మహా భక్తుడికి కలలో కనిపించి, ఆలయం నిర్మిస్తే ఆవిర్భవిస్తానని చెప్పాడట. ఆ భక్తుడు ఆయన ఆదేశం మేరకు ఆ గ్రామస్తుల సహకారంతో ఒక ఆలయాన్ని నిర్మించాడు.
ఆ భక్తుడికి చెప్పిన సమయానికి, గర్భాలయంలో స్వామివారు పెద్ద శబ్దం చేస్తూ వెలిశాడట. అలా స్వామివారు ఆలయ నిర్మాణం తరువాత స్వయంభువుగా ఇక్కడ వెలిశాడని అంటారు. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భావిస్తూ, అంకిత భావంతో ఆయనని సేవిస్తుంటారు. 'పండరీపురం'లోని పాండురంగస్వామి తరువాత ఆ స్థాయి మహిమలను చూపు దేవుడుగా భక్తులు కొలుస్తూ తరిస్తుంటారు.