ap7am logo

సమస్యలను తొలగించే సాయినాథుడు

Thu, Jul 23, 2015, 04:37 PM
Related Image శిరిడీ సాయిబాబా ఆలయాలు ఎక్కడ వున్నా భక్తులతో సందడిగానే కనిపిస్తుంటాయి. అందుకు కారణం ఆయన మహిమలు ఆర్తుల అనుభవంలోకి వస్తూ ఉండటమే. అనారోగ్యాల బారి నుంచీ .. ఆపదల బారి నుంచి .. ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బాబా రక్షిస్తూ ఉంటాడనే విశ్వాసంతో భక్తులు ఆయన పాదాలను ఆశ్రయిస్తుంటారు. ఆయన హారతులు పాడుతూ .. సేవలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వుంటారు.

అలా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా వెలుగొందుతోన్న బాబా ఆలయాలలో ఒకటి 'వైరా'లో కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వైరాలో ప్రధాన రహదారి పక్కనే ఈ ఆలయం అలరారుతూ వుంటుంది. ఇక్కడి విశాలమైన ప్రదేశంలో వివిధ దేవతా మూర్తుల ఆలయాలు దర్శనమిస్తూ వుంటాయి. వాటిలో ఒకటిగా బాబా ఆలయం ఆహ్లాదకరంగా కనిపిస్తూ వుంటుంది.

అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే ప్రశాంతత ప్రసాదంగా దొరుకుతుంది. బాబాను దర్శించుకుని .. ధ్యానం చేసుకుని .. పారాయణ చేసుకునేవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ప్రతి గురువారం బాబా సేవలో పాల్గొనే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. వివిధ రకాల సమస్యలతో మనశ్శాంతి లేకుండా సతమతమైపోతోన్నవాళ్లు, బాబా దర్శనం చేసుకుంటే చాలు వాటి బారి నుంచి బయటపడతారని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. సమస్యని బాబాకి చెప్పుకుంటే, అది తీరే వరకూ బాబా వెంటే ఉంటాడని విశ్వసిస్తూ వుంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy