ap7am logo

శ్రీరామనవమి రోజున దీపారాధన

Mon, Mar 23, 2015, 12:50 PM
Related Image శ్రీరామనవమి అనగానే ప్రతి గ్రామంలోను సందడి కనిపిస్తుంది. ఇక పట్టణాల్లోని కాలనీల్లోనూ ఇదే సంబరం దర్శనమిస్తుంది. దాదాపుగా ప్రతి గ్రామంలోను రామాలయం వుంటుంది. అందువలన సీతారాముల కల్యాణ మహోత్సవ సంబరం ఈ రోజున అన్నిచోట్లా కనువిందుచేస్తూ వుంటుంది.

రాముడు చైత్రశుద్ధ నవమి రోజున .. పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించినట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఉగాది నుంచి ఆరంభమయ్యే వసంతనవరాత్రుల్లో రామచంద్రుడిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో రామాయణ పారాయణం ... రామకథా గానం విశేషమైన ఫలితాలను ఇస్తాయి.

ఇక నవమి రోజున మధ్యాహ్నం సమయంలో అన్ని క్షేత్రల్లోను స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున పూజామందిరంలో సీతారాముల ప్రతిమలను ఏర్పాటు చేసుకుని ఆరాధించేవాళ్లు ఎంతోమంది వుంటారు. అయితే ఈ రోజున స్వామివారి సన్నిధిలో ఏ నూనెతో దీపారాధన చేయాలనే సందేహం కొంతమంది భక్తులకు కలుగుతుంటుంది.

ఎందుకంటే ఆయా పర్వదినాలలో దీపారాధనకి ఉపయోగించే తైలం కూడా విశేషాన్ని సంతరించుకుని వుంటుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజున దీపారాధనకి 'కొబ్బరి నూనె' ఉపయోగించాలని చెప్పబడుతోంది. ఈ రోజున పూజామందిరానికి రెండు వైపులా కొబ్బరినూనెతో గల దీపపు కుందులు వుంచి .. ఐదేసి వత్తుల చొప్పున కుందుల్లో వేసి వెలిగించ వలసి వుంటుంది. శ్రీరామనవమి రోజున ఇలా కొబ్బరినూనెతో దీపారాధన చేయడం వలన, విశేషమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy