ap7am logo

మహిమగల ఈ క్షేత్రంలో నిద్రచేస్తే చాలట !

Thu, Mar 19, 2015, 08:44 PM
Related Image అంతర్వేది అనే పేరులోనే పవిత్రత కనిపిస్తుంది ... ఆ పేరే ఓ మధురమైన మంత్రంలా వినిపిస్తుంది. నవనారసింహ క్షేత్రాల్లో అంతర్వేది ఒకటిగా చెప్పబడుతోంది. సాధారణంగా నరసింహస్వామి క్షేత్రమనగానే అది అత్యంత శక్తిమంతమైనదిగా ... విశిష్టమైనదిగా భక్తుల మనసులను దోచుకుంటూ వుంటుంది. అలా నరసింహస్వామి లక్ష్మీసమేతంగా ఆవిర్భవించిన క్షేత్రంగా అంతర్వేది అలరారుతోంది.

తూర్పుగోదావరి జిల్లా 'సఖినేటిపల్లి' మండలంలో గల ఈ క్షేత్రంలో అడుగడుగునా అనేక విశేషాలు కనిపిస్తూ వుంటాయి. దేవతలు ... మహర్షులు నడయాడిన పుణ్యస్థలిగా ఈ క్షేత్రం కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల మనోభీష్టం తప్పక నెరవేరుతుంది. ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతోన్న దంపతులకు సంతానాన్ని అనుగ్రహించడం ఇక్కడి స్వామివారి ప్రత్యేకతగా చెబుతుంటారు.

సంతానలేమితో బాధపడుతోన్న దంపతులు స్వామివారిని దర్శించి, ఆ రాత్రి ఇక్కడ నిద్ర చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన దంపతుల కోరిక నెరవేరుతుందని విశ్వసిస్తుంటారు. స్వామివారి నిదర్శనం ఎంతలా ఉంటుందనేది, ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకునే భక్తులను చూస్తే తెలిసిపోతుంది. ఇలా అంతర్వేది అనేక మహిమలకు నిలయంగా విలసిల్లుతూ వుంటుంది. దర్శన మాత్రం చేతనే భక్తుల మనోఫలకంపై శాశ్వతంగా నిలిచిపోతుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy