ap7am logo

యజ్ఞోపవీతం

Tue, Jun 25, 2013, 04:40 PM
బ్రహ్మ తత్వమును సూచించుటచే యజ్ఞోపవీతమునకు బ్రహ్మ సూత్రమనే పేరు వచ్చింది. వేదాలలోని మూడు సూత్రములను గ్రహించిన బ్రహ్మ వాటిని ఒక సూత్రంగా చేశాడు. విష్ణువు ఆ సూత్రమును రెట్టింపు చేయగా, శివుడు దానిని గాయత్రిచే అభిమంత్రించి బ్రహ్మ గ్రంధి చేశాడు. త్రిమూర్తుల కారణంగా 9 పోగుల యజ్ఞోపవీతం తయారు చేయబడింది.

యజ్ఞోపవీతంలోని ఈ తొమ్మిది పోగులలో బ్రహ్మ ... అగ్ని ... అనంతుడు ... చంద్రుడు ... పితృదేవతలు ... ప్రజాపతి ... వాయువు ... సూర్యుడు ... సర్వదేవతలు నివసిస్తుంటారు. బ్రహ్మచారులుగా వుండేవారు ధరించే యజ్ఞోపవీతానికి ... వివాహితులు ధరించే యజ్ఞోపవీతానికి మధ్య తేడా వుంటుంది. అలాగే శైవులు ... వైష్ణవులు ధరించే యజ్ఞోపవీతంలోను భేదాలు వుంటాయి.

ఇక ఈ యజ్ఞోపవీతం నాభికి తక్కువగా గానీ ... ఎక్కువగా గాని లేకుండా సమానంగా వుండాలనే నియమం చేయబడింది. యజ్ఞోపవీతం ధరించినవారు మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ ... ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపాలని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా వీరు దేవ... పితృ ... గురు రుణాలను తీర్చుకోవాలనే విషయాన్ని తెలియజేస్తోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy