ap7am logo

సంపదలను ప్రసాదించే రుద్రాక్ష

Mon, Feb 23, 2015, 03:41 PM
Related Image రుద్రాక్షలు వివిధ రకాల గుణాలను ... అనేక విశేషాలను సంతరించుకుని, ఆధ్యాత్మికపరంగాను ... ఆరోగ్యపరంగాను తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. తమని ధరించినవారికి మనోభీష్టసిద్ధిని కలిగిస్తూ మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. అలాంటి రుద్రాక్షలలో సంపదలను ... పేరు ప్రఖ్యాతులను కలిగించేదిగా 'నవముఖి రుద్రాక్ష' కనిపిస్తుంది.

జీవితంలో ప్రతిఒక్కరూ కోరుకునేది సంపదలు ... పేరు ప్రఖ్యాతులే. ప్రతి ఒక్కరికీ వాటివల్లనే నిజమైన సంతోషం చేకూరుతుంది. సంపదవల్లనే సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ వుంటుంది. అనేక కష్టనష్టాల బారినపడకుండా సంపద కాపాడుతూ వుంటుంది. వ్యక్తులు ... వాళ్ల స్వభావాలను బట్టి అవసరాలు తీరుస్తుంటుంది. దారిద్ర్యం వలన కలిగే సమస్త దుఃఖాలను నివారించేదిగా సంపద కనిపిస్తుంది.

తన కోరికలను నెరవేర్చుకోవడమే కాకుండా, ఇతరులకు సాయపడే శక్తిని ఇది ప్రసాదిస్తుంది. అలాంటి సంపదలను ... కీర్తి ప్రతిష్ఠలను అందించేదిగా 'నవముఖి రుద్రాక్ష' చెప్పబడుతోంది. ఈ రుద్రాక్ష నవశక్తులకు ప్రతీక కావడం వలన, దీనిని ధరించినవారిపై అమ్మవారి నవవిధ శక్తుల ప్రభావం ఉంటుంది. అరుదుగా మాత్రమే లభించే ఈ రుద్రాక్షను ధరించడం వలన నవశక్తుల అనుగ్రహంతో పాటు, సమస్త సంపదలు చేకూరతాయి .. కీర్తిప్రతిష్ఠలను పెంచుతాయని స్పష్టం చేయబడుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy