ap7am logo

మోచేతిపై పుట్టుమచ్చ వుంటే ఫలితం !

Sat, Dec 27, 2014, 06:56 PM
శరీరంపై వివిధ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు వుండటం సహజంగా జరుగుతూ వుంటుంది. కొన్ని పుట్టుమచ్చలు అవి వున్న ప్రదేశాన్నిబట్టి విశేషమైన ఫలితాలను ఇస్తే, మరికొన్ని ప్రతికూల ఫలితాలను ఇస్తుంటాయి. పుట్టుమచ్చ పరిమాణం ... దాని స్పష్టత ఫలితాన్ని ప్రభావితం చేస్తుంటాయని శాస్త్రం చెబుతోంది.

విద్య ... వివాహం ... సంతానం .. సౌభాగ్యం ... కార్యసిద్ధి ... ఆరోగ్యం ... ఐశ్వర్యం ... ఇలా ఎన్నిటికో సంబంధించిన విషయాలను పుట్టుమచ్చలు చెబుతుంటాయి. కొంతమంది ఈ విషయాలను గురించి పట్టించుకుంటే, మరికొంతమంది తేలికగా తీసుకుంటూ వుంటారు. పుట్టుమచ్చల ప్రభావం జీవితంపై కొంతవరకూ ఉంటుందని విశ్వసించేవాళ్లు వీటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

జీవితంలో ఆరోగ్యం ... ఆయుష్షు ... విజయం ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. కష్టాలను ఎదుర్కోడానికీ ... సుఖాలను అనుభవించడానికి ఆరోగ్యం ఎంతో అవసరం. అలాగే సంపదలను పెంచుకోవడానికి విజయాలు అవసరం. ఇక దీర్ఘకాలంపాటు ఆనందానుభూతులను సొంతం చేసుకోవడానికి ఆయుష్షు వుండాలి. 'మోచేతిపై పుట్టుమచ్చ' వుండటం వలన ఇవన్నీ లభిస్తాయని చెప్పబడుతోంది.

మోచేతిపై పుట్టుమచ్చ వుండటం వీటిపై మంచి ప్రభావాన్ని చూపుతుందట. అందువలన తలపెట్టినకార్యాలు సఫలీకృతం కావడం ... వ్యాధులబారిన పెద్దగా పడకపోవడం జరుగుతుందని అంటారు. ఈ పుట్టుమచ్చ ఇచ్చే మంచిఫలితం కారణంగా ఆయురారోగ్యాలతో జీవితం కొనసాగుతుందని చెప్పబడుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy