ap7am logo

గాజులు ధరిస్తున్నట్టుగా కల వస్తే ?

Tue, Sep 16, 2014, 07:26 PM
Related Image స్త్రీ జీవితంలో గాజులకు ఎంతో ప్రాముఖ్యత వుంది. వీటిని కేవలం అలంకార ప్రాయంగా ఎవరూ భావించరు. స్త్రీలు గాజులు దరించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. అందువల్లనే ఆడపిల్లలు చేతికి గాజులు లేకుండా కనిపిస్తే పెద్దలు మందలిస్తూ వుంటారు.

ఏ వేడుకకైనా వెళ్లవలసి వచ్చినా ... పండుగలు వచ్చినా స్త్రీలు ముందుగా కొత్తగాజులు కొనడానికే ఆసక్తిని చూపుతుంటారు. పుణ్యక్షేత్రానికి వెళితే ముందుగా స్త్రీలు కొనుగోలు చేసేది గాజులే. ఇక తమ బంధుమిత్రులను మరిచిపోకుండా గాజులు తీసుకుంటూ వుంటారు. గాజులు వేసుకునేటప్పుడు ... వాటిని ఇతరులకు చూపేటప్పుడు వాళ్లు పొందే ఆనందం అంతా ఇంతా కాదు.

స్త్రీ జీవితంలో ఇంతటి ఆనందానుభూతులను ఆవిష్కరించే గాజులు ... ఒక్కోసారి వాళ్ల కలలోకి కూడా వస్తుంటాయి. కలలో గాజులు ధరిస్తున్నట్టుగా కనిపిస్తే, మరునాడు ఉదయాన్నే ఆ విషయాన్ని గురించి ఇంట్లో ప్రస్తావిస్తుంటారు. అయితే ఆ విధంగా కలరావడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోననే సందేహం వాళ్లకి కలగకపోదు.

ఈ విధంగా కల రావడం శుభ సూచకమని శాస్త్రం చెబుతోంది. పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకి, గాజులు ధరిస్తున్నట్టుగా కల వస్తే ... త్వరలోనే వారి వివాహం జరుగుతుందని చెప్పబడుతోంది. ఈ కల వస్తే ... త్వరలో జరగనున్న వివాహానికి సూచనగా భావించవలసి ఉంటుందని స్పష్టం చేయబడుతోంది
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy