ap7am logo

కలలో వాన కనిపిస్తే ఫలితం ఇలా వుంటుంది !

Wed, Sep 10, 2014, 06:23 PM
Related Image వాన ... అనే మాట మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వానపడుతూ వుండే దృశ్యం ఆనందానుభూతులను అందిస్తుంది. వాన అంటే ఇష్టంలేని వాళ్లంటూ ఎవరూ కనిపించరు. వానలో తడవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఆసక్తి చూపుతుంటారు. మేఘాల కింద ఎవరో జల్లెడ పట్టినట్టుగా చినుకులు రాలితే చాలు, అప్పటి వరకూ పడిన కష్టాన్ని మరిచిపోయి ఆ వానను ఆస్వాదించే వాళ్లు కనిపిస్తుంటారు.

తడిస్తే మొలకెత్తం గదా అనుకుంటూ కావాలని వానలో నడుస్తూ వెళ్లే వాళ్లూ వుంటారు. వానలో తడిస్తే అనారోగ్యం బారిన పడవలసి వస్తుందని చెప్పేవాళ్ల మనసు కూడా వాన వైపు లాగుతూనే వుంటుంది. వానను కిటికీలో నుంచి చూడటానికి ... తడవడానికి ... తడుస్తూ నడవడానికి అంతా ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి వాన ఒక్కోసారి కలలో కూడా కనిపిస్తూ వుంటుంది. వానను కలలో చూసినా బయటచూసిన అనుభూతే కలుగుతూ వుంటుంది.

అయితే దాని ఫలితం ఎలా వుంటుంది ? అనే విషయమై కొంతమందికి సందేహం కలుగుతూ వుంటుంది. కలలో వాన కనిపించడం శుభసూచకమని శాస్త్రం చెబుతోంది. కలలో వాన కనిపించడం వలన, అప్పటి వరకూ ఇబ్బంది పెడుతూ వచ్చిన సమస్యలు తొలగిపోతాయట. సమస్యలు తొలగిపోయి సంతోషకరమైన జీవితం ఆరంభమవుతుందనే విషయాన్ని ఈ కల ముందుగా తెలియజేస్తూ ఉంటుందని చెప్పబడుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy