ap7am logo

శ్రీ మహాకాళీ దేవి

Tue, Jun 18, 2013, 03:03 PM
Related Image జానపద కథల్లో అందరినీ ఊరించే పేరు ఉజ్జయిని. అవంతి అనే పేరుతో కూడా అందరినీ ఆకట్టుకున్నఈ నగరంలోనే 'శ్రీ మహాకాళీ దేవి' శక్తి పీఠం విరాజిల్లుతోంది. సప్తమోక్ష పురాల్లో ఒకటిగా చెప్పుకునే ఈ క్షేత్రంలో సతీదేవి 'పై పెదవి'పడిందని చెప్పుకుంటారు. త్రిపురాసురులను సంహరించి విజయం సాధించిన పరమశివుడు ఇక్కడే మహాకాళేశ్వరుడిగా అవతరించాడు.

ఇక 'దూషణుడు' అనే రాక్షసుడు ప్రజల ప్రాణాలను హరిస్తూ వుండటం ముక్కంటి దృష్టికి వచ్చింది. ఆ రాక్షసుడి నెత్తురు కిందపడితే అలాంటి రాక్షసులే పుట్టుకొస్తారని తెలిసిన ఈశ్వరుడు, తెలివిగా పార్వతీదేవిని రంగంలోకి దింపాడు. మహాకాళిగా అవతరించిన అమ్మవారు ఆ రాక్షసుడుని సంహరిస్తూ వాడి నెత్తురు భూమి మీద పడకుండగా తన నాలుకను పరిచింది. ఈ సంఘటన అనంతరం అమ్మవారు కూడా మహాకాళిగా ఇక్కడ కొలువుదీరినట్లు స్థల పురాణం చెబుతోంది.

శ్రీ కృష్ణుడు ... మహాకవి కాళిదాసు ... విక్రమార్క మహారాజు ఈ అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహానికి పాత్రులైనట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక ఇక్కడి బలరామకృష్ణులు ... కుచేలుడు విద్యాభ్యాసం చేసిన సాందీపని మహర్షి ఆశ్రమం ... భేతాళ విక్రమార్కుల సంవాదం జరిగిన ప్రదేశం ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy