ap7am logo

శ్రీ మహాలక్ష్మీ దేవి

Tue, Jun 18, 2013, 01:20 PM
Related Image 'శ్రీ మహాలక్ష్మీ దేవి'శక్తి పీఠం మనకు మహారాష్ట్రలోని కొల్హాపురంలో కనిపిస్తుంది. పంచగంగా నదీ సమీపంలో ఈ శక్తి పీఠం విరాజిల్లుతోంది. సిరిసంపదలను ప్రసాదించే ఈ శక్తి పీఠం గురించిన ప్రస్తావన మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఒకానొకప్పుడు ఈ ప్రాంతాన్ని కరవీరుడు పాలిస్తూ వున్న కారణంగా ఇది 'కరవీరపురం'గా ప్రసిద్ధి చెందింది.

కరవీరుడు అతని ముగ్గురు సోదరులు ప్రజలను నానాకష్టాలు పెడుతూ ఉండటంతో, రాక్షస కుమారులైన ఆ నలుగురిని కూడా శివుడు సంహరించాడు. దాంతో కరవీరుడి తండ్రి అయిన కొల్హుడు ప్రతీకారంతో రగిలిపోతూ దేవతలపైకి దండెత్తాడు. దాంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి అతణ్ణి సంహరించింది. కొల్హుడి అభ్యర్ధన మేరకు ఆ ప్రాంతానికి అతని పేరు స్థిరపడేలా అనుగ్రహించింది.

ఇక్కడి అమ్మవారు మూడు అడుగుల ఎత్తులో శివలింగాకారంలో దర్శనమిస్తూ ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. మహిమాన్వితమైనటువంటి ఈ శక్తి పీఠానికి క్షేత్ర పాలకుడు కపిలేశ్వరుడు, ముందుగా ఆయనను దర్శించిన తరువాతనే అమ్మవారిని దర్శించాలి. అమ్మవారికి చెరో వైపున మహాకాళి - మహా సరస్వతి ఆలయములు వున్నాయి. నవదుర్గల ఆలయాలు ... నవగ్రహాల ఆలయాలతో పాటు, సాక్షి గణపతి .. సూర్యనారాయణుడు .. దత్తాత్రేయుడు ఇక్కడ కొలువుదీరి కనిపిస్తారు. దత్తాత్రేయుడు ఈ అమ్మవారి దగ్గరే ప్రతి రోజు బిక్ష స్వీకరించేవాడని స్థల పురాణం చెబుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy