ap7am logo

పూజ చేస్తున్నట్టుగా కల వస్తే ?

Mon, Aug 25, 2014, 10:39 PM
Related Image ఏదైనా కల వచ్చినప్పుడు మరునాడు ఉదయాన్నే ఆ కలను గురించి కుటుంబ సభ్యులతో గానీ ... స్నేహితులతో గాని చెప్పడం జరుగుతూ వుంటుంది. అది సంతోషాన్ని కలిగించే కల అయితే, సాధ్యమైనంత త్వరగా నిజం కావాలని కోరుకుంటారు. బాధని ... భయాన్ని కలిగించే కల అయితే అది ఎక్కడ నిజమవుతుందోనని ఆందోళన చెందుతూ వుంటారు.

సాధారణంగా కలలు మానసిక పరిస్థితికి తగినట్టుగా వస్తూవుంటాయి. అలాంటి కలల ఫలితాలను గురించి ఆలోచించవలసిన పనిలేదు. సహజంగా వచ్చే కలలు ... అదీ తెల్లవారు ఝామున వచ్చే కలలు మాత్రమే నిజమవుతూ ఉంటాయని చెప్పడం జరుగుతోంది. కలలో కనిపించే దృశ్యాలను బట్టి వాటి ఫలితాలు చెప్పడం జరుగుతూ వుంటుంది. ఈ నేపథ్యంలో కొంతమందికి తాము పూజ చేస్తున్నట్టుగా కల వచ్చే అవకాశం లేకపోలేదు.

అలాంటి కల వచ్చినప్పుడు దాని ఫలితం ఎలా వుంటుందో తెలియక వాళ్లు తికమక పడుతుంటారు. ఈ విధమైన కల రావడం శుభ సూచకమేనని శాస్త్రం చెబుతోంది. తాము పూజ చేస్తున్నట్టుగా కల రావడం వలన, కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్పబడుతోంది. కాబట్టి ఎప్పుడైనా తాము పూజ చేస్తున్నట్టుగా కల వస్తే, ఇక దాని గురించిన ఆలోచనలతో సతమతం కాకుండా ఆనందంగా ఉండొచ్చు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy