వేపంజెరి

భూలోకంలోని ప్రకృతి రమణీయతకు పరవశించిన పరమాత్ముడు అనేక ప్రదేశాల్లో కొలువుదీరాడు. అవే నేడు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో 'వేపంజెరి'ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆహ్లాదానికి అద్దంలా కనిపించే ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలో దర్శనమిస్తుంది. 17వ శతాబ్దానికి ముందునుంచే పూజలు అందుకుంటోన్న ఈ క్షేత్రం ఆలయాల సమాహారంగా కనిపిస్తుంది.

చాలా ప్రాచీనమైనదిగా చెప్పుకునే ఈ క్షేత్రంలో 'లక్ష్మీ నారాయణులు' ప్రధాన దేవతా మూర్తులు ... స్వామివారి తొడపై కూర్చుని అమ్మవారు దర్శనమిస్తుంటుంది. ఈ ప్రాంగణంలో 'శ్రీ చక్రత్తాళ్వార్ ఆలయం' ... 'యోగా నృసింహాస్వామి ఆలయం' ... 'భక్త ఆంజనేయస్వామి ఆలయం' ... 'విద్యా వినాయక స్వామి ఆలయం' ... 'నవగ్రహాలయం' .. 'అయ్యప్ప స్వామి ఆలయం' ... 'అష్టలక్ష్మీ ఆలయం'కొలువుదీరి కనిపిస్తాయి. ఒక్కో ఆలయం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటాయి.

ఇక విరాట్ విష్ణు స్వరూపం ... రంగనాథస్వామి విగ్రహాలు భారీగా నిలిచి భక్తులను ఆనందాశ్చర్యాలకు గురిచేస్తుంటాయి. ఇక్కడి అష్టలక్ష్మీ ఆలయంలోకి అడుగుపెడితే, ఓ దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. దీక్షలు ధరించిన భక్తుల తాకిడి యోగా నృసింహ స్వామి ఆలయానికి ఎక్కువగా వుంటుంది. ఇక్కడి పుష్కరిణి మధ్యలో కాళీయ మర్థన ఘట్టం కనువిందు చేస్తూ వుంటుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్ర దర్శనం ... మనసులో చెరగని ముద్ర వేస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు.


More Bhakti News