విజయాలను ప్రసాదించే పాండవతీర్థం

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. 'కుమారధార తీర్థం' .. 'సనక సనందన తీర్థం' .. 'తుంబుర తీర్థం' .. 'జాబాలీ తీర్థం' .. 'పాపనాశన తీర్థం' .. 'పాండవ తీర్థం' ఇలా ఎన్నో తీర్థాల సమాహారంగా తిరుమల కనిపిస్తుంది. ఒక్కో తీర్థం ఒక్కో ప్రత్యేకతను .. విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. 'పాండవ తీర్థం' విషయానికే వస్తే, ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు నశించి .. విజయాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు, ఈ తీర్థంలో కొంతకాలం పాటు స్నానమాచరించమని శ్రీకృష్ణుడు చెప్పాడట. ఆ విధంగా చేయడం వలన విజయం చేకూరుతుందని సెలవిచ్చాడు. దాంతో పాండవులు ఏడాది పాటు ఈ తీర్థం సమీపంలోనే నివాసం ఏర్పాటుచేసుకుని .. అందులో స్నానం చేస్తూ వచ్చారట. ఈ కారణంగానే ఆ తరువాత పాండవులు యుద్ధంలో విజయాన్ని సాధించి రాజ్యాన్ని పొందారు. పాండవుల ధర్మ బద్ధమైన కోరికను నెరవేర్చిన తీర్థం కావడం వలన, 'పాండవ తీర్థం' అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.


More Bhakti News