కార్యసిద్ధిని కలిగించే హనుమంతుడు

ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో వాళ్లకి సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఎక్కడ రామ నామం వినిపిస్తే అక్కడ హనుమ ఉంటాడనీ .. ఎవరు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే వాళ్లను స్వామివారు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడనేది మహర్షుల మాట. హనుమ ఎంతటి పరాక్రమవంతుడో అంతటి వినయ సంపన్నుడు. భక్తితో పిలిస్తే చాలు ఆయన కరుణతో కరిగిపోతాడు.

అలాంటి ఆ స్వామికి ప్రతి మంగళవారం 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే సిందూర అభిషేకం .. ఆకుపూజ చేయించాలి. స్వామికి గారెలు .. బూరెలు .. వడలు .. తీపి అప్పాలు అంటే ఎంతో ప్రీతి. అందువలన వాటిని ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా హనుమకు ప్రీతిని కలిగించేలా ఆయనను పూజిస్తే అనారోగ్యాలు .. ఆపదలు తొలగిపోతాయి. మానసికపరమైన చీకాకులు దూరమవుతాయి. అంతేకాదు .. ధర్మబద్ధమైన ఎలాంటి కార్యమైనా స్వామి అనుగ్రహంతో వెంటనే సఫలీకృతం అవుతుంది. సమస్యలతో సతమతమవుతున్నవారికి  హనుమ ఆరాధనకు మించి విరుగుడు లేదనేది మహర్షుల మాట.


More Bhakti News