అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివకేశవులు

నదీ తీరాల్లో శివకేశవులు కొలువైన క్షేత్రాలు మరింత విశేషమైనవిగా .. విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. అలా శివ కేశవులు కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రంగా 'వాడపల్లి' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా 'దామరచర్ల' మండలంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడ మూసీ నదీ తీరంలో లక్ష్మీ నరసింహస్వామి .. కృష్ణానదీ తీరంలో మీనాక్షీ అగస్త్యేశ్వరుడు కొలువై పూజాభిషేకాలు అందుకుంటున్నారు.

ప్రాచీనకాలం నాటి ఈ ఆలయాల దర్శనం వలన .. మనసుకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఇది మూసీ .. కృష్ణా నదీ సంగమ స్థానం కావడంతో, ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. లక్ష్మీనరసింహస్వామి మూర్తిని .. మీనాక్షీ అగస్త్యేశ్వరుడిని అగస్త్యుడు ప్రతిష్ఠించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.  ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు నశించి .. పుణ్యరాశి పెరుగుతుందని చెబుతారు.      


More Bhakti News