ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి కూర్చుని ఉండటమే ప్రత్యేకం

సాధారణంగా సుబ్రహ్మణ్యస్వామి నిలుచునే భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అలా కాకుండా ఆ స్వామి కూర్చుని దర్శనమిచ్చే క్షేత్రం ఒకటుంది .. అదే 'తిరుప్పరంకున్రమ్'. స్వామి ఇలా కూర్చుని దర్శనమివ్వడమే ఈ క్షేత్రం ప్రాధాన్యతగా చెబుతారు. సుబ్రహ్మణ్యస్వామి .. దేవసేనను వివాహమాడిన ప్రదేశం ఇదే.

పూర్వం శూరపద్ముడు .. దేవలోకాన్ని ఆక్రమించి దేవేంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు. ఆ సమయంలో శూరపద్ముడిపై దండెత్తి వెళ్లి ఆయనను సుబ్రహ్మణ్యస్వామి సంహరించాడు. తన సింహాసనం తనకి దక్కేలా చేసిన సుబ్రహ్మణ్య స్వామికి దేవేంద్రుడు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాదు తన గారాల కూతురైన 'దేవసేన'ను ఇచ్చి వివాహం చేశాడు. అలా దేవసేనను సుబ్రహ్మణ్యస్వామి వివాహమాడిన పరమపవిత్రమైన ప్రదేశమే 'తిరుప్పరంకున్రమ్'. గర్భాలయంలో స్వామివారికి ఒక వైపున దేవసేన .. మరో వైపున నారద మహర్షి ఉండటం విశేషం.     


More Bhakti News