పుష్పయాగం .. దర్శన ఫలితం

భగవంతుడికి వివిధ రకాల పూలతో పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. తాజా పూలతో .. సువాసన వెదజల్లే పూలతో భగవంతుడిని పూజించడం వలన ఆయన ప్రీతి చెందుతాడు. తెలుపు .. పసుపు రంగు పూలు శ్రేష్ఠమైనవనేది మహర్షుల మాట. ఆయా క్షేత్రాల్లో భగవంతుడికి 'పుష్పయాగం' చేస్తుంటారు. వివిధ రకాల పూలు ఈ పుష్పయాగంలో ఉపయోగిస్తుంటారు.

జాజులు .. మెట్ట తామరలు .. ఎర్ర కలువలు .. తెల్ల కలువలు .. సంపెంగలు .. బక పుష్పాలు మొదలైనవి పుష్పయాగంలో ఉపయోగిస్తుంటారు. పుష్పయాగం చేయడం వలన 'అశ్వమేథ యాగం' చేసిన ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఏ ప్రాంతంలో అయితే పుష్పయాగం జరుగుతుందో, ఆ ప్రాంతంలో కరువుకాటకాలు ఉండనే వుండవు. సిరి సంపదలతో అక్కడి ప్రజలు తులతూగుతారు .. అనారోగ్యాలు దరిచేరవు. పుష్పయాగాన్ని దర్శించడం వలన సమస్త పాపాలు నశిస్తాయి .. సకల శుభాలు చేకూరతాయి. ముందు తరాల వారు ... వెనుక తరాల వారు సైతం తరిస్తారు.        


More Bhakti News