భీమశంకరానికి అందుకే ఆ పేరు

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఢాకినిలోని 'భీమశంకరం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వతంపై వుంది. పరమేశ్వరుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించడానికీ .. స్వామివారికి భీమశంకరుడు అనే పేరు రావడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. త్రిపురాసురులను సంహరించిన అనంతరం పరమశివుడు ఈ ప్రదేశంలోనే విశ్రాంతి తీసుకున్నాడట.

అప్పటికి చాలాకాలంగా ఆ ప్రదేశంలోనే సూర్యవంశ రాజైన భీమకుడు, శివుడి సాక్షాత్కారం కోసం తపస్సు చేసుకుంటున్నాడు. భీమకుడి తపస్సుకి మెచ్చిన శివుడు ఆయనకి ప్రత్యక్ష దర్శనమిచ్చాడు. ఆ భక్తుడి కోరికమేరకు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి భీమశంకరమనీ .. స్వామివారికి భీమశంకరుడు అని పేరు వచ్చినదని ఆ కథనం. పరమపవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సమస్త పాపాలు నశించి .. దోషాలు తొలగిపోయి .. శుభాలు కలుగుతాయనేది మహర్షుల మాట.    


More Bhakti News