కార్తిక పౌర్ణమి రోజున జ్వాలా తోరణోత్సవం

పూజలకు .. వ్రతాలకు .. దానాలకు .. కార్తిక మాసం ఎంతో విశేషమైనది. ఈ మాసంలో ప్రతిరోజు ఎంతో విశిష్టమైనదిగా కనిపిస్తుంది. ఇక 'కార్తిక పౌర్ణమి' మరింత ప్రత్యేకతను సంతరించుకుని అనంతమైన ఫలితాలను అందిస్తూ ఉంటుంది. అలాంటి కార్తిక పౌర్ణమి రోజున శివాలయాలన్నీ కూడా భక్తులతో ఎంతో రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజున శివాలయాలలో 'జ్వాలా తోరణోత్సవం' నిర్వహిస్తుంటారు.

జ్వాలా తోరణోత్సవం ఈ రోజున జరపడానికి కారణంగా కొన్ని కథనాలు ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తున్నాయి. పరమశివుడు విషాన్ని మింగినప్పుడు ..ఆ గండం గడిస్తే 'జ్వాలా తోరణం' క్రిందుగా మూడుమార్లు దూరి వస్తానని అమ్మవారు మొక్కుకుందనేది ఒక కథనం. ఇక శివుడు .. త్రిపురాసురులను సంహరించి విజేయుడై తిరిగి వస్తుండగా, ఆయనకి దృష్టి దోషం తగలకుండా అమ్మవారు ఈ జ్వాలా తోరణోత్సవం నిర్వహించిందనేది మరో కథనం. ఆలయాల్లో నిర్వహించే 'జ్వాలా తోరణం' క్రిందుగా దూరి వెళితే దృష్టి దోషాలు తొలగిపోతాయనీ .. ఆపదలు దరిచేరవని చెబుతుంటారు.         


More Bhakti News