నాశిక్ లో శ్రీరామకుండం ప్రత్యేకత

వనవాస కాలంలో సీతారాములు అనేక ప్రదేశాలను తమ పాదధూళిచే పవిత్రం చేశారు. అవన్నీ కూడా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. అలాంటి దర్శనీయ స్థలాలలో 'నాశిక్' ఒకటిగా కనిపిస్తుంది. సీతారాములు నడయాడిన పుణ్యభూమి అనే దృష్టితో నాశిక్ ను చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఇక్కడి గోదావరి తీరంలో సీతారాములు కొంతకాలం వున్నారని స్థలపురాణం చెబుతోంది.

అలాంటి నాశిక్ లో భక్తులు చూడదగినవిగా 'సుందరనారాయణ మందిరం' .. నారో శంకర మందిరం' .. 'రామకుండం' కనిపిస్తాయి. వాటిలో 'శ్రీరామకుండం'మరింత ప్రత్యేకతను .. విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. రామ నామమే సమస్త పాపాలను పటాపంచలు చేస్తుంది .. రామ దర్శనమే సమస్త దోషాలను హరింపజేస్తుంది. ఇక ఆ రాముడే నడయాడిన ప్రదేశాన్ని స్పర్శించడం వలన .. అక్కడి రామకుండంలో స్నానం చేయడం వలన మోక్షం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అందువల్లనే 'కుంభమేళ' సమయంలో వేలాదిమంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తుంటారు .. శ్రీరాముడి అనుగ్రహం చేత తరిస్తుంటారు.    


More Bhakti News