అందుకే శివుడికి బిల్వ పత్రాలు ప్రీతి

పరమశివుడు దయా సముద్రుడు .. పిలిస్తే పలికే దైవం. దోసెడు నీళ్లతో అభిషేకం చేసి .. బిల్వ పత్రాలతో పూజిస్తే చాలు, ఆయన సంతోషపడిపోతాడు .. సంతృప్తి చెందుతాడు. అలా సదాశివుడు అభిషేకానికే ఆనందించడానికీ .. బిల్వ పత్రాలతో ప్రీతి చెందడానికి కారణం లేకపోలేదు. పూర్వం సముద్ర మథనంలో హాలాహలం పుట్టినప్పుడు, సమస్త జీవులను కాపాడటం కోసం ఆయన ఆ విషాన్ని కంఠంలో బంధించాడు. ఆ కారణంగా ఆయన తల భాగమంతా వేడెక్కింది.

ఆయన శిరస్సు చల్లబడటం కోసం దేవతలంతా నీటితో అభిషేకం చేశారు. బిల్వ పత్రాలు చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటాయి. అందువలన దేవతలు వాటితో శివుడిని పూజించారు. అప్పుడు శివుడికి ఉపశమనం కలిగింది. అందువలన శివుడికి అభిషేకం .. బిల్వ పత్రాలతో పూజ ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇక మహాశివరాత్రి రోజున ఆ దేవదేవుడిని అభిషేకించి .. బిల్వ పత్రాలతో పూజించేవారికి, మరింత విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News