గౌరీదేవికి ఆ పేరు అలా వచ్చిందట!

గౌరీదేవి ఆరాధన అనంతమైన ప్రభావం చూపుతుందనీ, విశేషమైన ఫలితాలను ఇస్తుందని స్త్రీలు విశ్వసిస్తుంటారు. అందుకే ఆ తల్లిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు. అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంగా ఆధ్యాత్మిక గ్రంధాలలో ఒక కథనం కనిపిస్తూ ఉంటుంది.

ఒకసారి పరమశివుడు .. అమ్మవారిని ఆటపట్టించడం కోసం 'కాళా' అంటూ పిలిచాడట. తాను నల్లగా ఉండటం వల్లనే స్వామి అలా పిలిచాడని చెప్పేసి అమ్మవారు చిన్నబుచ్చుకుంది. తన తపోశక్తితో మేనిఛాయను మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఆమె శరీరం 'గౌరు వర్ణం'లోకి మారిపోయింది.

అమ్మవారు గౌరు వర్ణంలో మెరిసిపోతూ దర్శనమివ్వడంతో గౌరీదేవిగా పూజించడం మొదలైంది. ఇక క్షీరసాగర మథనంలో పుట్టిన కాలకూట విషాన్ని సైతం శివుడు కంఠంలో దాచుకోగలిగాడు. అందుకు కారణం పార్వతీదేవి మాంగల్య బలంగా చెప్పబడుతోంది. అందువల్లనే ఆ తల్లిని సర్వమంగళగా భక్తులు కొలుస్తుంటారు. శ్రావణ మంగళవారాల్లో ఆ తల్లిని పూజిస్తూ .. కలకాలం సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుతుంటారు.


More Bhakti News