ఏకాదశి

'ఏకాదశి'అనగానే ఎంతో పుణ్య ప్రదమనే విషయం చాలామందికి తెలుసు. తాము అనుకున్న కార్యాలు ఈ రోజున ప్రారంభించడానికి అంతా ఆసక్తి చూపుతుంటారు. నెలకి రెండు ఏకాదశుల చొప్పున, ఇటు శుక్ల పక్షంలోను .. అటు కృష్ణ పక్షంలోను కలిపి ఏడాదికి 24 ఏకాదశులు వస్తుంటాయి.

'చైత్ర శుద్ధ ఏకాదశి' .. 'చైత్ర బహుళ ఏకాదశి'..'వైశాఖ శుద్ధ ఏకాదశి'.. 'వైశాఖ బహుళ ఏకాదశి'.. 'జ్యేష్టశుద్ధ ఏకాదశి'.. 'జ్యేష్ట బహుళ ఏకాదశి' .. 'ఆషాఢ శుద్ధ ఏకాదశి'.. 'ఆషాఢ బహుళ ఏకాదశి'.. 'శ్రావణ శుద్ధ ఏకాదశి'.. 'శ్రావణ బహుళ ఏకాదశి'.. 'భాద్రపద శుద్ధ ఏకాదశి'.. 'భాద్రపద బహుళ ఏకాదశి'.. 'ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి'.. 'ఆశ్వయుజ బహుళ ఏకాదశి'.. 'కార్తీక శుద్ధ ఏకాదశి' .. 'కార్తీక బహుళ ఏకాదశి' .. 'మార్గశిర శుద్ధ ఏకాదశి' .. 'మార్గశిర బహుళ ఏకాదశి' .. 'పుష్య శుద్ధ ఏకాదశి' .. 'పుష్య బహుళ ఏకాదశి' .. 'మాఘశుద్ధ ఏకాదశి' .. 'మాఘబహుళ ఏకాదశి'.. 'ఫాల్గుణ శుద్ధ ఏకాదశి' .. 'ఫాల్గుణ బహుళ ఏకాదశి' ఏడాది పొడవునా పలకరిస్తూ వుంటాయి.

ఈ ఏకాదశుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత వుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశుల్లో చేసే పూజాది కార్యక్రమాల కారణంగా వివిధ రకాల దోషాలు తొలగిపోవడమే కాకుండా, ఆశించిన పుణ్య ఫలాలను అందిస్తూ వుంటాయని తెలియజేస్తున్నాయి.


More Bhakti News