ధర్మాన్ని రక్షిస్తూ వచ్చిన శ్రీకృష్ణుడు

19-02-2015 Thu 13:38

కౌరవులు తమ ఒక్కగానొక్క సోదరి అయిన 'దుశ్శల' వివాహాన్ని 'సైంధవుడు'తో జరిపిస్తారు. పాండవులు అరణ్యవాసం చేస్తోన్న సమయంలో సైంధవుడు అటుగా వస్తాడు. ఆ సమయంలో అక్కడి కుటీరంలో ద్రౌపది ఒక్కతి మాత్రమే వుంటుంది. అదే సరైన సమయంగా భావించిన సైంధవుడు, ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు.

తన పాతివ్రత్యాన్ని గురించీ ... తన భర్తల శౌర్యపరాక్రమాల గురించి ద్రౌపది ఎంతగా చెప్పినా అతను వినిపించుకోకుండా ఆమెని అపహరించడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే మహాబల సంపన్నుడైన భీమసేనుడు అతని ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. ద్రౌపది విషయంలో అతని ధోరణిపట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ సంహరించబోతాడు.

చివరి నిముషంలో ధర్మరాజు అడ్డుపడతాడు. సైంధవుడి భార్య అయిన దుశ్శల తమకి కూడా సోదరి అనే విషయాన్ని భీముడికి గుర్తుచేస్తాడు. దుశ్శల పసుపు కుంకుమలను కాపాడవలసిన బాధ్యత తమపై కూడా వుందని చెబుతాడు. తమ కారణంగా దుశ్శల కన్నీళ్లు పెట్టకూడదనీ, సైంధవుడిని క్షమించి వదిలివేయడమే మంచిదని అంటాడు. ధర్మరాజు హితవాక్యల కారణంగా భీముడి ఆవేశం చల్లారుతుంది. దాంతో పాపానికి పాల్పడిన సైంధవుడికి జుట్టు తీయించి ప్రాణాలతో వదిలిపెడతాడు.

అలా ధర్మరాజు క్షమాభిక్ష కారణంగా సైంధవుడు బతికి బయటపడతాడు. అయితే ఆ అవమానాన్ని మనసులో పెట్టుకున్న సైంధవుడు, యుద్ధరంగంలో అభిమన్యుడు ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్యకారకుడు అవుతాడు. అలాంటివాడిని రెండవసారి మన్నించడం మంచికాదని భావించిన అర్జునుడు .. సైంధవుడి శిరస్సును ఖండిస్తాడు. ఈ విషయంలోను అర్జునుడికి శ్రీకృష్ణుడు అండగా నిలుస్తాడు. ధర్మపరులైన పాండవులకి విజయం చేకూరేలా చేస్తాడు.


More Bhakti Articles
Telugu News
tsr leaders likely to attend ntr 100th jayanthi in hyderabad
ఫిల్మ్ న‌గ‌ర్‌లో రేపు ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌... హాజ‌రుకానున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
7 hours ago
Patidar scores fifty against Rajasthan Royals
రాణించిన పాటిదార్.. మిగతా బ్యాట్స్ మెన్ ఫెయిల్!
8 hours ago
Keerthi Jalli gone viral in social media
కీర్తి జల్లి ఐఏఎస్... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలంగాణ బిడ్డ!
8 hours ago
tpcc chief revanth reddy in america tour
అమెరికాలో రేవంత్ రెడ్డి!.. జీన్స్‌, టీష‌ర్ట్‌లో క‌నిపించిన టీపీసీసీ చీఫ్‌!
8 hours ago
bjp telangana chief bandi sanjay anger over party spokes persons
స్పందించ‌మ‌న్నా ప‌ట్టించుకోవ‌ట్లేదు!.. బీజేపీ అధికార ప్ర‌తినిధుల‌పై బండి సంజ‌య్ ఆగ్ర‌హం
8 hours ago
KTR haves lunch at a roadside restaurant in Zurich
జ్యూరిచ్ వీధుల్లో దర్జాగా... కేటీఆర్ ఫొటోలు ఇవిగో!
9 hours ago
Nara Lokesh says he will not contest to party general secretary post
పొత్తుల విషయం ఎన్నికలప్పుడే మాట్లాడాల్సిన అంశం: నారా లోకేశ్
9 hours ago
these are the tdp resolutions in mahanadu
ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా విజ‌యం సాధించాల్సిందే!... మ‌హానాడులో టీడీపీ తీర్మానం
9 hours ago
Hungary firm Keeway enters into Indian market with two scooters
భారత్ లో కాలుమోపిన హంగేరీ ద్విచక్రవాహనాల సంస్థ.. ఈ స్కూటర్లు కాస్త ఖరీదే గురూ!
9 hours ago
ఈ నెల 31న చ‌మురు కంపెనీల‌ నుంచి కొనుగోళ్ల నిలిపివేత‌: ఏపీ పెట్రోలియం డీల‌ర్ల ప్ర‌క‌ట‌న‌
10 hours ago