భగవంతుడికి నచ్చనిది అహంభావమే !

15-02-2015 Sun 11:28

అహంభావంతో మిడిసిపడినవాళ్లు అవమానాలపాలైన సంఘటనలు ఎన్నో కనిపిస్తుంటాయి. తమ శౌర్యపరాక్రమాలు ... కీర్తిప్రతిష్ఠలు చూసుకుని ఎంతోమంది పొంగిపోయారు. తమ చుట్టూ వున్నవారు పొగుడుతూ వుంటే, తమంతవారు లేరనే గర్వంతో సాక్షాత్తు భగవంతుడినే ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. అలాంటివారిలో 'బాణాసురుడు' ఒకడుగా కనిపిస్తాడు. ఒకసారి బాణాసురుడు పరమశివుడిని గురించి కఠోర తపస్సు చేస్తాడు. అతని భక్తిశ్రద్ధలకు మెచ్చిన శివుడు సహస్ర బాహుబలాన్ని వరంగా ప్రసాదిస్తాడు.

ఆ వరగర్వంతోనే అతను అమరలోకంపై దండెత్తుతాడు. ఒక్కొక్కటిగా సాధిస్తోన్న విజయాలు అతనికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దాంతో బాణాసురుడు నేరుగా శివుడి దగ్గరికి వెళతాడు. తన శక్తిసామర్థ్యాలను గురించి ప్రస్తావిస్తాడు. తనకి ఎదురుగా నిలబడి పోరాడే శక్తిమంతుడు ఎక్కడా తారసపడలేదని నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తాడు. తనతో పోరాటానికి సిద్ధమై, తన బాహుబలాన్ని పూర్తిస్థాయిలో పరీక్షించుకోవడానికి తగిన అవకాశాన్ని ఇవ్వమని శివుడిని అడుగుతాడు.

తాను ప్రసాదించిన వరబల గర్వంతో తననే పోరుకి పిలుస్తోన్న బాణాసురుడి ధోరణి శివుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వరాన్ని ప్రసాదించిన తానే దానిని పరీక్షించాలనుకోవడం సరైనది కాదనీ, తనంతటి శక్తిమంతుడితో యుద్ధంచేసే అవకాశం త్వరలోనే అతనికి కలుగుతుందని చెబుతాడు శివుడు. స్వామి అలా ఎందుకన్నాడనేది శ్రీకృష్ణుడితో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు బాణాసురుడికి అర్థమవుతుంది.

బాణాసురుడి కుమార్తె అయిన ఉష .. కృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడిని ప్రేమిస్తుంది. వారి వివాహానికి నిరాకరించిన బాణాసురుడు, అనిరుద్ధుడిని బంధిస్తాడు. అనిరుద్ధుడిని బంధవిముక్తుడిని చేయడమే కాకుండా, అతనితో ఉష వివాహానికి అంగీకరించమని బాణాసురుడిని హెచ్చరించడానికి శ్రీకృష్ణుడు వస్తాడు. ఈ సమయంలోనే శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగిన బాణాసురుడు ఆయన్ని ఎదిరించలేక అవమానం పాలవుతాడు.


More Bhakti Articles
Telugu News
Sajjala terms Pawan Kalyan an actor and Chandrababu a natural actor
పవన్ కల్యాణ్ నటుడైతే, చంద్రబాబు సహజ నటుడు: సజ్జల
9 minutes ago
Jagan has been doing good works with voluntees says Vellampalli Srinivas
జగన్ పేరును నిలబెట్టేలా వాలంటీర్లు పని చేయాలి!: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
23 minutes ago
Released on parole last year to decongest Tihar jail more than 3000 inmates missing
రద్దీ తగ్గుతుందని పెరోల్​ ఇస్తే.. పారిపోయిన ఖైదీలు!
36 minutes ago
AP BJP leaders complains CEC against YCP candidate Dr Gurumurthy
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి పోటీకి అనర్హుడు: సీఈసీకి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు
40 minutes ago
I rejected CM post for Telangana state says Jana Reddy
సీఎం పదవిని ఇస్తామన్నా వద్దని చెప్పాను: జానారెడ్డి
42 minutes ago
Arvind Kejriwal Announces Weekend Curfew in Delhi
ఢిల్లీలో వారాంతపు​ కర్ఫ్యూ విధిస్తున్నాం: ముఖ్యమంత్రి కేజ్రీవాల్
56 minutes ago
Uttar Pradesh medical staff negligence in giving right dose
ఎంత నిర్లక్ష్యం?... తొలి డోసు కొవాగ్జిన్ ఇచ్చి, రెండో డోసు కొవిషీల్డ్ ఇచ్చారు!
56 minutes ago
All TDP leaders are against to Chandrababu and Nara Lokesh says Peddireddi Ramachandra Reddy
చంద్రబాబు, లోకేశ్ కు టీడీపీలో అందరూ వ్యతిరేకంగా ఉన్నారు: పెద్దిరెడ్డి
1 hour ago
AP High Court issues notices to Union Government
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో సీబీఐ మాజీ జేడీ పిటిషన్... కేంద్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు
1 hour ago
Rupee Goes From Asias Best To Worst Performing In 2 Weeks On Covid Surge
సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​: ఆసియాలో ఉన్నత స్థానం నుంచి పతనం స్థాయికి రూపాయి!
1 hour ago