ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని అభిషేకిస్తే చాలు

03-02-2015 Tue 16:59

సుబ్రహ్మణ్యస్వామి కొన్నిక్షేత్రాల్లో విగ్రహరూపంలోను ... కొన్నిక్షేత్రాల్లో పుట్టరూపంలోను ... మరికొన్ని క్షేత్రాల్లో సర్పరూపంలోను పూజలు అందుకుంటూ వుంటాడు. చాలా అరుదుగా లింగరూపంలోను దర్శనమిస్తూ వుంటాడు. అలాంటి సుబ్రహ్మణ్యస్వామి కొన్నిక్షేత్రాల్లో ప్రధానదైవంగాను ... మరికొన్నిచోట్ల పరివారదేవతగాను కనిపిస్తూ వుంటాడు. ఇక స్వామివారు ఎక్కడ కొలువై వుంటే అక్కడ మహిళా భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది.

సుబ్రహ్మణ్యస్వామివారిని పూజిస్తే నాగదోషం తొలగిపోతుందనీ, సంతానభాగ్యం లభిస్తుందనే విశ్వాసం ప్రాచీనకాలం నుంచి వుంది. అందువలన ఈ క్షేత్రాలను మహిళా భక్తులు ఎక్కువగా దర్శిస్తూ వుంటారు. అలాంటి క్షేత్రాల జాబితాలో 'ఊడిమూడి' ఒకటిగా కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడి గోదావరి నదీ సమీపంలో గల శివాలయంలోనే సుబ్రహ్మణ్యస్వామి కొలువుదీరి కనిపిస్తూ వుంటాడు. ప్రాచీనకాలంనాటి విశేషాలను సంతరించుకున్న క్షేత్రం ఇది.

ఇక్కడి స్వామి మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తుంటారు. సర్పదోషంతో బాధలుపడుతోన్నవాళ్లు ... సంతానభాగ్యం కోరుకునేవారు స్వామివారికి పూజాభిషేకాలు జరిపిస్తుంటారు. స్వామివారిని అభిషేకించడం వలన పాపాలు .. దోషాలు నశిస్తాయని అంటారు. సుబ్రహ్మణ్యస్వామికి ప్రీతికరమైనవిగా చెప్పబడుతోన్న అరటిపండ్లను ... పాయసాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు. అలా స్వామివారిని పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరినవాళ్లు ఎంతోమంది వున్నారని చెబుతుంటారు.

మనోభీష్టం నెరవేరిన తరువాత మళ్లీ దర్శించుకుంటామని మొక్కుకున్నవాళ్లు ఆ విషయాన్ని మరిచిపోతే, స్వప్నం ద్వారా గుర్తుచేయడం ఇక్కడి స్వామివారి ప్రత్యేకతని అంటారు. స్వామివారి అనుగ్రహాన్ని పొందినవాళ్లు తమ పిల్లలకు ఆయనపేరు కలిసివచ్చేలా పేరుపెడుతూ వుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారికి ప్రత్యేకపూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. ఆయురారోగ్యాలను ... సంతాన సౌభాగ్యాలను ప్రసాదించమని ఆ స్వామిని ప్రార్ధిస్తూ వుంటారు ... ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti Articles
Telugu News
YS Jagan Ex Adviser PV Ramesh Responds about his tweet
రాజకీయ దుమారం రేపుతున్న జగన్ మాజీ సలహాదారు పీవీ రమేశ్ ట్వీట్
14 minutes ago
Entry into Tamilnadu with E pass Only
పెరుగుతున్న కరోనా కేసులు... తమిళనాడు కీలక నిర్ణయం!
23 minutes ago
Kruti Shetty bags a film in Tamil
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
30 minutes ago
Twist in Ramesh Jarkiholi sex CD scandal
కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి లైంగిక వేధింపుల కేసులో మలుపు!
36 minutes ago
Fake Preasts Cheats Women in Nirmal Dist
మహిళను నమ్మించి, రూ. 21 లక్షలు నొక్కేసిన కోయ పూజారులు!
43 minutes ago
Carolina Marin Defeats PV Sindhu One More Time
కరోలినా మారిన్ చేతిలో మరోసారి ఓడిన పీవీ సింధు!
53 minutes ago
APJ Abdul Kalam Brother Thiru Mohd Muthu Meera Maraikayar passes away
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పెద్దన్న కన్నుమూత
55 minutes ago
India Becoms world Leader in Vaccine Says US Scientist
మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడుతున్న ఇండియా!: పొగడ్తల వర్షం కురిపించిన యూఎస్ శాస్త్రవేత్త1
1 hour ago
Clashes broke out in Bhainsa in Nizamabad district
భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు.. కత్తులతో వీధుల్లో అల్లరి మూకల హల్‌చల్.. ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమం!
1 hour ago
France Billioneer Oliver Dassault Died in Helicopter Crash
హెలికాప్టర్ కూలిన ఘటనలో ఫ్రెంచ్ బిలియనీర్ ఓలివర్ దస్సాల్ట్ దుర్మరణం!
1 hour ago