శివ దర్శనం

వైష్ణవ ఆలయాలలో మూలవిరాట్టుకు ఎదురుగా హనుమంతుడు గానీ ... గరుత్మంతుడు గాని కొలువుదీరి వుంటారు. అలాగే శివాలయాల్లో గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు తీరికగా కూర్చుని ఉంటాడు. వైష్ణవ ఆలయాల్లో మూలమూర్తిని దర్శించుకోవడానికి ముందు గరుత్మంతుడికి గానీ ... హనుమంతుడికి గాని నమస్కరించుకోవాలి. ఇక శివాలయాలకి వెళ్లినప్పుడు కుడిచేతితో నందీశ్వరుడి తోక నిమురుతూ ... ఎడమ చేయి బొటనవ్రేలు ... చూపుడు వ్రేలు నందీశ్వరుడి కొమ్ములపై నుంచి గర్భాలయంలోని శివుడిని దర్శించుకోవలసి వుంటుంది.

ఇదొక నియమం అని గానీ ... ఈ విధంగా చేయాలని గాని చాలామందికి తెలియదు. ఇక ఇలా చేసేవారిలో కూడా కొందరికి ఇందులోని ఆంతర్యం తెలియక పోవచ్చు. సాధారణంగా ప్రముఖులను కలుసుకోవాలని అనుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న నమ్మకస్తులతో కాస్త కలుపుగోలుగా వ్యవహరిస్తూ ముందుగా వారి అనుగ్రహాన్ని సంపాదించవలసి వుంటుంది. అలాగే ఇక్కడ నందీశ్వరుడు తోక నిమిరి ఆయనకు ఆనందాన్ని కలిగిస్తే, స్వామివారి దర్శనానికి మనం వచ్చామని చెబుతాడని అంటారు.

స్వామి వారి దృష్టి మనపై పడటం కన్నా కావలసినదేముంటుంది? నందీశ్వరుడి ద్వారా శివయ్య అనుగ్రహం త్వరగా లభిస్తుంది కనుక అంతా ఈ నియమాన్ని పాటిస్తూ ఉండటమనేది తరతరాలుగా వస్తోంది.


More Bhakti News