మహిమ చూపే మహాదేవుడి క్షేత్రం

22-10-2014 Wed 14:39

పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి 'బి.అన్నవరం' గ్రామంలో కనిపిస్తుంది. అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలంలో దర్శనమిస్తుంది.

సాధారణంగా ఈ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. కాకతీయుల నిర్మాణ శైలి ... వాళ్ల కాలంలో శివలింగాలు రూపొందిన విధానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ... శివలింగాకృతి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ వుంటుంది. అందువలన ఇది కాకతీయుల కాలానికి పూర్వం నాటిదిగా చెప్పబడుతోంది.

ఇక్కడి ఆధారాలపై పరిశోధన జరిగితే ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం లభించే అవకాశం వుంది. ఎంతోమంది మహారాజులు ... సంస్థానాధీశులు ... మహాభక్తులు ఇక్కడి స్వామివారి దర్శనం చేసుకుని తరించారని అంటారు. పూర్వం ఈ ప్రాంతం నుంచి 'శ్రీశైలం' వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడి సదాశివుడిని దర్శించుకుని వెళ్లేవాళ్లట.

ఈ స్వామిని ముందుగా దర్శించుకోవడం వలన అత్యంత కష్టతరమైన శ్రీశైల ప్రయాణంలో ఎలాంటి ఆపదలు ... ఆటంకాలు సంభవించవని విశ్వసించేవారట. ఎలాంటి ఆపదలైనా ఈ స్వామి దర్శనమాత్రం చేత దూరమవుతాయనే విశ్వాసం ఇప్పటికీ ఇక్కడ బలంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే ఆపదలను తొలగించే ఇక్కడి మహాదేవుడిని మహిమాన్వితుడుగా చెప్పుకుంటూ వుంటారు ... కనులారా ఆ స్వామిని దర్శిస్తూ మనసారా సేవిస్తూ వుంటారు.


More Bhakti Articles
Telugu News
Case filed against a man after he killed a rat by drowning it in drainage
ఎలుకను డ్రైనేజిలో ముంచి చంపిన వ్యక్తిపై కేసు నమోదు
16 minutes ago
Supreme Court sensational comments on TRS govt
తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయి: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
17 minutes ago
jawahar reddy appointed as ap chief secretary
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి నియామకం.. సీఎంఓలోకి పూనం
18 minutes ago
Mallikarjun Kharge fires on Modi
మోదీగారూ, మీ ముఖాన్ని మేము ఎన్నిసార్లు చూడాలి?: మల్లికార్జున ఖర్గే
29 minutes ago
ap high court dismisses ab venkateswara rao petition
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
39 minutes ago
Five signs that indicates heart weakness
గుండె బలహీనపడుతోందని చెప్పే ఐదు సంకేతాలు ఇవే!
50 minutes ago
Markets ends in profits
స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోరు.. సరికొత్త రికార్డులకు సెన్సెక్స్
59 minutes ago
Jayamalini Interview
నేను ఏ హీరోతోను మాట్లాడేదానిని కాదు: జయమాలిని
1 hour ago
ts high court permits ys sharmila padayatra ikn telangana
షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
1 hour ago
Corona cases increasing in China
చైనాలో కరోనా కలకలం... ఆక్సిజన్ యంత్రాలకు భారీగా పెరిగిన డిమాండ్
1 hour ago